ETV Bharat / state

'వంశపారంపర్య రాజకీయాలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు' - భాజపా రాష్ట్ర ఇంఛార్జీ తరుణ్ చుగ్ తాజా వార్తలు

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో భాజపా నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర ఇంఛార్జీ తరుణ్ చుగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పురపాలిక ఎన్నికల్లో గెలుపునకు కార్యకర్తలు బాగా కృషి చేయాలని కోరారు. అచ్చంపేటలో గూండా పాలన నడుస్తోందని విమర్శించారు.

bjp State incharge Tarun Chugh, bjp meeting Achampet, Nagar Kurnool

author img

By

Published : Apr 25, 2021, 12:56 PM IST

తెరాస ప్రభుత్వం వంశపారంపర్య రాజకీయాలు చేస్తోందని.. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని భాజపా రాష్ట్ర ఇంఛార్జీ తరుణ్ చుగ్ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భాజపా కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అచ్చంపేటలో 20 వార్డులకూ అభ్యర్థులను నిలబెట్టినందుకు జిల్లా అధ్యక్షుడు సుధాకర్ రావును తరుణ్ చుగ్ అభినందించారు. అచ్చంపేటలో గూండా పాలన, భూ కబ్జాదారుల రాజ్యం నడుస్తోందని.. వారిపై పోటీకి నిలబడిన అభ్యర్థులు ధైర్యంగా పోరాడాలని సూచించారు.

గువ్వల బాలరాజు ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేస్తూ.. దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. వారికి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఎన్నికల్లో గెలుపునకు కార్యకర్తలు బాగా కృషి చేయాలన్నారు.

ఇదీ చూడండి: కరోనాను సమర్థంగా ఎదుర్కొంటాం : మంత్రి శ్రీనివాస్ గౌడ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.