ETV Bharat / state

'కేసరి సముద్రం ఆయకట్టు రైతులను ఆదుకోండి'

author img

By

Published : Aug 7, 2020, 7:21 PM IST

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కేసరి సముద్రం చెరువు అలుగులను జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు.. ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు.

'కేసరి సముద్రం ఆయకట్టు రైతులను ఆదుకోండి'
'కేసరి సముద్రం ఆయకట్టు రైతులను ఆదుకోండి'

కేసరి సముద్రం చెరువు ఆయకట్టు పరిధిలోని చిన్న, సన్నకారు రైతులను ఆదుకోవాలని... ఆయకట్టు రైతులను న్యాయం జరిగేలా చూడాలని జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కేసరి సముద్రం చెరువు అలుగులను ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.

ఆయకట్టు రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టరేట్ లో కలెక్టర్ శర్మన్ చౌహాన్ తో కలిసి సమీక్ష నిర్వహించారు. కేఎల్ఐ ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు ఉండటం వల్ల బఫర్ జోన్ పరిధిలో ఉన్న రైతులు ఎలాంటి పంటలు పండించుకోలేకపోతున్నారని తెలిపారు. చిన్న, సన్నకారు రైతులు ఆర్థికంగా నష్టాలకు గురవుతున్నారన్నారు. చెరువులోని నీటి నిలువ శాతాన్ని తగ్గించి రైతులకు న్యాయం చేయాలని అధికారులకు ఆదేశించారు.

బఫర్ జోన్ పరిధిలో అక్రమ కట్టడాలను తొలగించాలని ఆచారి తెలిపారు. కలెక్టర్ శర్మన్ సానుకూలంగా స్పందించి చెరువు ఆయకట్టులో ఉన్న రైతులను న్యాయం జరిగేలా చూస్తామని.. బఫర్ జోన్ పరిధిలో నిర్మించిన అక్రమ కట్టడాలను వెంటనే తొలగిస్తామని స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.