తెలంగాణ రైతును దేశానికి రాజు చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ప్రతి గ్రామంలో రైతుల కోసం వ్యవసాయ అభివృద్ధి సమావేశాలకై రైతు వేదికలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. బీడు పడ్డ భూములన్నీ కేసీఆర్ హయాంలో పచ్చదనంతో ఆహ్లాదకరంగా మారాయని వెల్లడించారు.
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి నిరంజన్ రెడ్డి... ఉప్పునుంతల మండలం దేవదారికుంట, అచ్చంపేట పట్టణంలో రైతు వేదికలను ప్రారంభించారు. కరోనా కాలంలో కూడా రైతులను ఆదుకున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణాయేనని మంత్రి పేర్కొన్నారు.
- ఇదీ చదవండి: ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యుల ఆందోళన