ETV Bharat / state

'ఎమ్మెల్యే బాలరాజు నీ వైఖరి మార్చుకో' - Farmers protest for chandrasagar water

నాగర్ కర్నూల్ జిల్లాలోని చంద్రసాగర్ ప్రాజెక్టులో నీరు ఉన్నప్పటికీ... సాగు కోసం విడుదల చేయకుండా స్థానిక ఎమ్మెల్యే బాలరాజు అడ్డుపడుతున్నాడని రైతన్నలు ఆరోపిస్తున్నారు. వెంటనే నీరు విడుదల చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.

'ఎమ్మెల్యే బాలరాజు నీ వైఖరి మార్చుకో'
'ఎమ్మెల్యే బాలరాజు నీ వైఖరి మార్చుకో'
author img

By

Published : Nov 13, 2020, 7:47 PM IST

అన్ని ఉన్నా అల్లుడి నోట్ల శని అన్నట్టుగా తయారైంది... అన్నదాతల పరిస్థితి. భారీ వర్షాలకు చంద్రసాగర్ ప్రాజెక్టులో నీరు నిండుకుండలా ఉన్న స్థానిక నాయకుల వల్ల సాగు భూములకు నీరు అందకుండా పోయింది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో అతి పెద్ద నీటి పారుదల ప్రాజెక్టు చంద్రసాగర్. ఈ ఏడాది కురిసిన భారీ వానలకు చెరువులోకి భారీగా వరద నీరు వచ్చి నిండుకుండలా మరింది.

10 ఏళ్లుగా వర్షాలు లేక చెరువు నిండకపోవడం వల్ల ఆయకట్టు రైతులు భూములను సాగు చేయకుండా ఉన్నారు. ఈ ఏడాది కురిసిన వానలకు రైతులు వరి, వేరుశనగ పంటలను వేసేందుకు సిద్ధమవుతుండగా... స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు భూగర్భజలాల పెరుగుదల సాకు చెప్పి సాగుకు నీరు విడుదల చేయకూడదని ఇరిగేషన్ శాఖ అధికారులకు హుకుం జారీ చేశారు. ఈ ఘటనపై రైతులు ఆందోళన చేపట్టారు.

ఎమ్మెల్యే బాలరాజు తన వైఖరిని మార్చుకొని సాగునీరు విడుదల చేయాలని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు.

ఇదీ చదవండి:విపత్తు సాయం కింద 6 రాష్ట్రాలకు రూ.4,382 కోట్లు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.