నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్‌లో ప్లాస్టిక్‌ను నిషేధించాలని మహిళా సంఘాలు, అంగన్వాడీ టీచర్లు ఈటీవీ-ఈనాడు ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. పురపాలక కమిషనర్ వెంకటయ్య ఈ ర్యాలీని ప్రారంభించారు. పట్టణ పురవీధుల నుంచి మహిళా సంఘాలు, అంగన్వాడీ కేంద్ర టీచర్లు, నగర పంచాయతీ సిబ్బంది, పోలీసులు రోడ్లపై ర్యాలీ చేశారు. ప్లాస్టిక్ నిషేధించాలని నినాదాలు చేశారు.
నగర వాసులతో, మహిళా సంఘాలతో ప్లాస్టిక్‌ని నిషేధిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. పట్టణంలోని వివిధ దుకాణాలు, వైన్ షాపులు, కూరగాయల యజమానులు ప్లాస్టిక్ నిషేధించాలని కమిషనర్ వెంకటయ్య కోరారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంకటయ్య, సీఐ వెంకట్‌రెడ్డి, ఐసీడీఎస్ సీడీపీఓ. వెంకటరమణ, ఎస్ఐలు, పట్టణ వాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ కవర్లు ఉపయోగిస్తే వాతావరణం కాలుష్యమవుతుందన్నారు స్థానిక సీఐ వెంకట్ రెడ్డి. అంగన్వాడీ కేంద్రాల సూపర్వైజర్లు కాలనీల్లో ఇంటింటికి తిరిగి ప్లాస్టిక్ నిషేధించాలని అవగాహన కల్పిస్తామని తెలిపారు.
ఇదీ చూడండి : బాల భీమురాలు పుట్టింది.. చిరునవ్వులు పూయించింది!