మేడారం జాతర దగ్గర పడుతున్న వేళ పోలీసులు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. వరంగల్ ఎస్పీ రవీందర్ ఇవాళ ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారానికి వచ్చారు. గిరిజన వన దేవతలు సమ్మక్క సారలమ్మ దర్శించుకున్నారు. అనంతరం చిలకల గుట్ట, పార్కింగ్ స్థలాలు, పోలీస్ క్యాంపులను పరిశీలించారు. వచ్చే నెల 5 నుంచి 8 తేదీ వరకు జరిగే మేడారం మహా జాతరకు వచ్చిపోయే భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా చర్యలు చేపడుతున్నామని ఆయన తెలిపారు.
సొంత వాహనాల్లో మేడారం జాతరకు వచ్చే భక్తులకు రహదారి వెంబడి ఎలాంటి ట్రాఫిక్ జామ్ కాకుండా చూసేందుకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇవీ చూడండి: భాజపాకు ఎందుకు ఓటెయ్యాలి : కేటీఆర్