ములుగు జిల్లా వాజేడు మండల గిరిజన గ్రామాల్లో సౌర విద్యుత్ వెలుగులు విరజిమ్మనున్నాయి. అందులో భాగంగా జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ పీవో హనుమంతు కె జండాగే చొరవతో.. రూ. 30 లక్షల నిధులతో సౌర విద్యుత్తు సామగ్రిని కొనుగోలు చేశారు. వాటిని సమీప కూలీల సహాయంతో కొండ ప్రాంతాలకు అధికారులు తరలించారు.
ఇంటింటికీ..
ప్రధాన రహదారి చీకుపల్లి గ్రామం నుంచి 16 కిలోమీటర్ల దూరంలో అడవుల్లో, గుట్టపై ఏర్పాటు చేయనున్నారు. పెనుగోలు గూడెంలో నివసిస్తున్న 26 కుటుంబాలకు ఇంటింటికీ రెండేసి బ్యాటరీలు, ఇన్వెర్టర్లతో పాటు ప్యానల్ బోర్డులు ఇవ్వనున్నారు.