ములుగు జిల్లా మదనపల్లి గ్రామంలో హనుమాన్ దీక్ష ధరించిన స్వాములకు రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
మహమ్మద్ ఆజిని, మహమ్మద్ సోఫీ, మహమ్మద్ బషీర్, మహమ్మద్ మొబిన్ పాషా, మహమ్మద్ మ్యూజిఫ్, పంచాయతీ కార్యదర్శి సురేశ్, ఓరుగంటి రాజశేఖర్ ఆధ్వర్యంలో స్వాములకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు పోరిక విజయరామ్ నాయక్తో పాటు పలువురు స్వాములు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఎంపీ రఘురామకృష్ణరాజును అరెస్టు చేసిన ఏపీ సీఐడీ