ETV Bharat / state

రామప్పలో కార్తీక సోమవారం ప్రత్యేక పూజలు - karthika monday latest news

ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రామప్ప ఆలయంలో కార్తీక సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామికి పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు.

special pooja in ramappa temple on the eve of karthika somavaram in mulugu district
రామప్ప ఆలయంలో కార్తీక సోమవారం పురస్కరించుకుని పూజలు
author img

By

Published : Nov 16, 2020, 12:13 PM IST

ములుగు జిల్లా వెంకటాపూర్​ మండలం పాలంపేట గ్రామంలోని ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కార్తీక సోమవారం పురస్కరించుకుని ఆలయ అర్చకులు.. స్వామి వారికి ప్రత్యేక అభిషేకం, అర్చన పూజలు నిర్వహించారు.

రామప్ప ఆలయానికి భక్తులు, మహిళలు తరలివచ్చి.. ఆలయంలోని వినాయకుని విగ్రహం ముందు దీపాలు వెలిగించారు. అనంతరం భక్తిశ్రద్ధలతో నంది విగ్రహం వద్ద పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు.

ఇదీ చదవండిః యాదాద్రిలో కార్తీక శోభ... రోజుకు ఆరు బ్యాచ్‌లకు అనుమతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.