ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో నిర్వహించే సమక్క సారలమ్మ జాతర సమీపిస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు ఈ జాతరను నిర్వహించనున్నారు. అభివృద్ధి పనులు చేయటానికి ప్రభుత్వం ఇప్పటికీ రూ.75కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ సందర్భంగా జిల్లా ఉన్నత అధికారులతో గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. తర్వాత మహబూబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోతు కవితతో కలిసి మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకున్నారు.
ఇదీ చదవండిః గుండెపోటుతో మరో ఆర్టీసీ కార్మికుడు మృతి