ETV Bharat / state

'మేడారం జాతర అభివృద్ధి పనులపై సమీక్ష' - మేడారం జాతర పనులను సమీక్షించిన ములుగు కలెక్టర్

ఆసియా ఖండంలోని అత్యధిక మంది హాజరయ్యే మేడారం జాతరకు వచ్చే భక్తుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసి విజయవంతం చేయాలని ములుగు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి విజ్ఞప్తి చేశారు.

review on medaram jathara
'మేడారం జాతర అభివృద్ధి పనులపై సమీక్ష'
author img

By

Published : Dec 18, 2019, 11:22 PM IST

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతరలో భాగంగా జరుగుతున్న అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి పరిశీలించారు. ఆసియా ఖండంలోని అత్యధిక మంది హాజరయ్యే మేడారం జాతరకు వచ్చే భక్తుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసి విజయవంతం చేయాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు.

జంపన్నవాగు నుంచి చిలకలగుట్ట వరకు జరుగుతున్న స్నానాల ఘట్టాల వద్ద వాటర్ ట్యాప్ పనులను పరిశీలించారు. గత జాతర అనుభవాలను దృష్టిలో పెట్టుకుని జంపన్న వాగు నీటి ప్రవాహంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన అధికారుల సమీక్ష సమావేశంలో వివిధ శాఖల ద్వారా చేపట్టిన పనులు వివరాలను సంబంధిత ముఖ్య అధికారులను అడిగి తెలుసుకున్నారు. జాతరలో ప్లాస్టిక్ సేకరణ కోసం ఎక్కువ సంఖ్యలో ప్లాస్టిక్ సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. భక్తుల సౌకర్యార్థం కోసం ఏర్పాటు చేయనున్న 7 షెడ్ల నిర్మాణం జనవరి 20 లోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

'మేడారం జాతర అభివృద్ధి పనులపై సమీక్ష'

ఇవీచూడండి: 'బకాయిల చెల్లింపులతో రాష్ట్రాలకు ఊతమివ్వండి'

Intro:tg_wgl_51_18_medaramlo_samiksha_ab_ts10072_HD
G Raju mulugu contributor

యాంకర్ వాయిస్ : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతరలో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆసియా ఖండంలోని అత్యధికంగా భక్తులు హాజరయ్యే మేడారం జాతరకు వచ్చే భక్తుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ జాతరను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి అన్నారు. మేడారం లో జరుగుతున్న అభివృద్ధి పనులను వివిధ శాఖల అధికారులతో పనులను పరిశీలించారు జంపన్నవాగు నుండి చిలకలగుట్ట వరకు జరుగుతున్న స్నానఘట్టాల వద్ద వాటర్ టాప్ పనులను పరిశీలించారు. భక్తుల సౌకర్యార్థం చేయాల్సిన ఏర్పాట్లను సంబంధిత కాంట్రాక్టర్, అధికారులతో చర్చించి పలు సూచనలు సలహాలు అందించారు గత జాతర అనుభవాలను దృష్టిలో పెట్టుకుని జంపన్న వాగు నీటి ప్రవాహంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జంపన్నవాగులో 3 నుండి 31/2 ఫీట్ల లోతు దాటకుండా లెవలింగ్ చేయాలన్నారు. ఊరట్టం వెళ్లే నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఐటీడీఏ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన అధికారుల సమీక్ష సమావేశంలో వివిధ శాఖల ద్వారా చేపట్టిన పనులు వివరాలను సంబంధిత ముఖ్య అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ నెలాఖర్లోగా పనులు పూర్తి చేయకపోతే బిల్లులు మంజూరు చేయబడిందని అన్నారు. పారిశుద్ధ్యం విషయంలో ప్రత్యేక చర్యలు చేపట్టి ల వారిగా పారిశుద్ధ్య కార్మికులను ఏర్పాటు చేయాలని డీపీవో ను ఆదేశించారు. జాతరలో హాజరయ్యే భక్తులకు తాగునీటి సౌకర్యం తలెత్తకుండా మిషన్ భగీరథ అధికారులు వెంటనే జిల్లాలను ఏర్పాటు చేయాలన్నారు. మేడారం ఊరటం నార్లపూర్ సర్పంచులు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగితే జాతరలో దుకాణాలు ఏర్పాటు చేసుకునే వారికి అనుమతి ఇచ్చే టప్పుడు వ్యాపారం చేసి వ్యాపారులతో ప్లాస్టిక్ నిషేధం ఉల్లంఘనకు పాల్పడితే భారీగా జరిమానాలు వివరించాలని సూచించారు. జాతరలో ప్లాస్టిక్ సేకరణ కోసం ఎక్కువ సంఖ్యలో ప్లాస్టిక్ సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు జాతర దుకాణాలు నిర్వహించే వ్యాపారులు తడి పొడి చెత్త వేరుగా నిల్వ చేసేట్లు చర్యలు చేపట్టాలన్నారు. భక్తుల సౌకర్యార్థం కోసం ఏర్పాటు చేయనున్న 7 షెడ్ల నిర్మాణం జనవరి 20 లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు వారు చేపట్టిన పనుల వివరాలు ఎప్పటికప్పుడు తెలపాలని, పనుల పురోగతిపై విజిలెన్స్ అధికారులకు స్పష్టత ఉండాలి అన్నారు. అన్ని శాఖల అధికారులు వారి వారి శాఖల ద్వారా భక్తులకు అందించే సేవలు, సౌకర్యాలు వివరాలను జాతరకు రూపొందించనున్న ప్రత్యేక యాప్ లో పొందుపర్చుటకు సమర్పించాలన్నారు. అధికారులు సమన్వయంతో అంకితభావంతో పనిచేసి జాతర విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఎ పిఓ చక్రధరరావు, జడ్పీ సీఈవో పో పారిజాతం తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Body:ss

Conclusion:బైట్: సి నారాయణ రెడ్డి ములుగు జిల్లా కలెక్టర్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.