ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో 2022 సంవత్సరానికి ఫిబ్రవరి 16,17,18,19న మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర ఆయా తేదీలలో నిర్వహించేందుకు కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గత ఏడాది నిర్వహించిన జాతరను దృష్టిలో పెట్టుకొని వచ్చే జనాభాకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు.
జాతర ఏర్పాట్లలో బాగంగా ఆర్ అండ్ బీ, ఇరిగేషన్, వైద్యారోగ్య శాఖ తదితర శాఖలు నిర్వహించే పనుల ప్రతిపాదనలు త్వరితగతిన పూర్తి చేసి పంపించాలని కలెక్టర్ అన్నారు. ముఖ్యంగా కొవిడ్ నిబంధనలు పాటించే క్రమంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ హన్మంతు కే జెండగే, అదనపు కలెక్టర్ ఆదర్శ సురభి, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, అర్ అండ్ బీ ఈఈ వెంకటయ్య, ఇరిగేషన్ ఈఈ మాణిక్య రావు, దేవాదాయ శాఖ అధికారి రాజేందర్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.