ములుగు జిల్లా జంగాలపల్లి క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ద్విచక్ర వాహనాలు నడుపుతూ శిరస్త్రాణం ధరించని వారిని ఆపి కచ్చితంగా హెల్మెట్ ధరించాలని తెలిపారు. జీపులు, కార్లు నడిపే డ్రైవర్లు సీటు బెల్టు పెట్టుకోవాలని అవగాహన కల్పించారు.
శిరస్త్రాణం ధరించకుండా వాహనాలు నడిపితే... కఠిన చర్యలు తప్పవని ఎస్సై బండారి రాజు తెలిపారు. సీటు బెల్ట్ పెట్టుకోకుండా వాహనం నడిపి ఏదైనా ప్రమాదం జరిగితే... ప్రాణాపాయం ఎక్కువ ఉంటుందని వివరించారు.
ఇవీ చూడండి: శిరస్త్రాణం ధరించకుంటే క్లిక్మనిపిస్తారు..