వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆలయాల వద్ద భక్తుల తాకిడి కొనసాగుతోంది. నగరంలోని వడ్డేపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో.. శ్రీవారి దర్శనం కోసం జనం పోటెత్తారు. మధ్యాహ్న సమయంలోనూ బారులు తీరి దర్శన భాగ్యం దక్కించుకున్నారు.
గోవింద నామస్మరణంతో ఆలయం మార్మోగింది. శ్రీవారి దర్శనంతో భక్తకోటి పులకరించింది. చిన్నాపెద్దా అందరూ ఉత్సవాలను వేడుకగా తిలకించారు.
ఇదీ చూడండి: వైకుంఠ ఏకాదశి పర్వదిన విశిష్టత తెలుసా...?