ETV Bharat / state

అధికారులు స్పందించారు.. ఆ కుటుంబాన్ని గట్టెక్కించారు - bahubali scene repeats in mulugu

Bahubali Scene repeats : రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాల వల్ల వరద ప్రభావం కొనసాగుతూనే ఉంది. ములుగు జిల్లాలో ఓ ఇంటిని వరదలు చుట్టు ముట్టాయి. బతుకు జీవుడా అనుకుంటూ 16 రోజుల పసికందుతో వారు పునరావాస కేంద్రానికి చేరారు. అక్కడ కూడా నీరు చేరడంతో అధికారులకు సమాచారం ఇచ్చారు. స్పందించిన అధికారులు వారిని వరద కష్టాల నుంచి గట్టెక్కించారు.

Bahubali Scene repeats
వరదలు
author img

By

Published : Jul 15, 2022, 10:46 AM IST

అధికారులు స్పందించారు.. ఆ కుటుంబాన్ని గట్టెక్కించారు

Bahubali Scene repeats : ఎడతెరిపిలేని వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం అయింది. ఇల్లు, వాకిలి వదలి ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లుతున్నారు. తాజాగా ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో వరదలు ఓ ఇంటిని చుట్టు ముట్టాయి. ఆ కుటుంబం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పునరావాస కేంద్రానికి చేరుకున్నారు. ఆ కుటుంబంలో 16 రోజుల పసికందు ఉండటంతో వారు జాగ్రత్తగా వరద ముంపును దాటారు. వారు పసికందును అరచేతిలో పట్టుకొని నీటిలో మునగకుండా పునరావాస కేంద్రానికి వెళ్లారు. ఇది బాహుబలి సినిమాలో మహేంద్ర బాహుబలిని శివగామి తన చేతిలో పట్టుకుని కాపాడిన సీన్​ని తలపించింది.

ఎంతో కష్టపడి పునరావాస కేంద్రానికి చేరుకున్న వారు.. బతుకుజీవుడా అని ఊపిరి పీల్చుకునేలోపే అక్కడికీ వరద నీరు వచ్చి చేరింది. దీంతో వారు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఆ కుటుంబం అధికారులకు సమాచారం ఇచ్చారు. స్పందించిన అధికారులు వారిని సురక్షితంగా వేరే ప్రాంతానికి తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.