ములుగు జిల్లా కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకు ముందు జనాలు మాస్కులు లేకుండా గుమిగూడారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా పట్టించుకోకుండా భౌతిక దూరం పాటించకుండా జనం బ్యాంకు గేటు ముందు నిలబడ్డారు. ఒక్కరు కూడా భౌతిక దూరం పాటించకుండా, ఒకరిపై ఒకరు తోసుకున్నారు. కొంత మంది మాస్కులు కూడా ధరించకుండా వచ్చారు. వారికి సూచనలు చేసేందుకు అధికారులు కూడా అందుబాటులో లేకుండా పోయారు.
ఎస్బీఐ బ్యాంకు వద్దకు పింఛను కోసం వచ్చిన ఓ వృద్ధురాలు బ్యాంకులోకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఇది ఇలాగే కొనసాగితే కరోనా వ్యాప్తి తప్పదు అని అంటున్నారు స్థానికులు.
ఇవీ చూడండి: 'ఆసుపత్రులు సందర్శించని ఏకైక సీఎం కేసీఆర్'