ETV Bharat / state

'నిరాశ్రయులను చేరదీయండి.. ఉండేందుకు ఆశ్రయం కల్పించండి'

మతిస్థిమితం లేకుండా.. ఆకలితో అలమటిస్తూ రోడ్డు మీద ఎవరైనా తిరుగుతుంటే వారిని చేరదీసి అన్నంతో వారి కడుపును నింపాలని ములుగు జిల్లా సబ్​ రిజిస్ట్రార్ తస్లీమా సూచించారు.

mulugu sub registrar says show some humanity to people who need food
'నిరాశ్రయులను చేరదీయండి.. ఉండేందుకు ఆశ్రయం కల్పించండి'
author img

By

Published : Apr 9, 2021, 12:34 PM IST

ములుగు జిల్లా కేంద్రంలో మతిస్థిమితం లేకుండా నిరాశ్రయులైన వారిని ఆదరించి అన్నం పెట్టాలని సూచించారు సబ్​ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్. మతిస్థిమితం లేక దిక్కుతోచని స్థితిలో తిరుగుతున్న అనాధ యువకుడిని చేరదీసి... క్షౌరం చేయించారు. స్నానం చేయించి, కొత్త బట్టలు వేయించి, కడుపు నిండా అన్నం పెట్టి ఆదరించారు.

సర్వర్ ఫౌండేషన్ సభ్యులకు ఫోన్​ ద్వారా వివరాలు తెలిపి... అతనికి ఆశ్రయం కల్పించారు. యువకుని జేబులో డబ్బులు ఉన్నా సరే తినలేని స్థితిలో ఉన్నాడని తెలిపారు. అలా ఎవరైనా ఆకలితో అలమటిస్తూ కనిపిస్తే అన్నంపెట్టి... ఫౌండేషన్​ వారికి ఫోన్ చేసి ఆశ్రయం కల్పించాలని తస్లీమా సూచించారు.

ఇదీ చూడండి: రెండోసారి కరోనాను జయించిన 104 ఏళ్ల బామ్మ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.