ETV Bharat / state

మేడారం ఎఫెక్ట్: ములుగుకు నలభైరోజుల్లో నాలుగో 'సారు'

మేడారం జాతరలో ఓ వైపు భక్తుల రద్దీ కొనసాగుతుంటే...మరోవైపు కలెక్టర్ల స్థానచలనం జరుగుతోంది. జాతర ప్రారంభం నుంచి ఇప్పటిదాకా ముగ్గురు కలెక్టర్లు మారారు. తాజాగా ఉట్నూరు.. ఐటీడీఏ పీవోగా ఉన్న కృష్ణ ఆదిత్య జిల్లా కలెక్టర్​గా నియమితులయ్యారు.

author img

By

Published : Feb 4, 2020, 3:22 PM IST

Mulugu collectors
కలెక్టర్ల మార్పు
కలెక్టర్ల మార్పు

తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం జాతరలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. జాతర ఇంకా ప్రారంభం కాకముందే.....పెద్ద సంఖ్యలో భక్తులు సమ్మక్క సారలమ్మలను దర్శించుకుంటున్నారు. ఆదివారం ఒక్కరోజే...పది లక్షల మందికిపైగా భక్తులు దర్శనాలు చేసుకున్నారు.

ఒకరు ప్రారంభిస్తే... మరొకరు పూర్తి..!

మేడారం జాతర ప్రారంభమైన దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ల మార్పులు జరుగుతున్నాయి. జాతర పనులు... ఒక పాలనాధికారి ప్రారంభిస్తే...మరొకరు హయంలో పూర్తికావచ్చాయి. మేడారం జాతర పనులను ఆనాడు జిల్లా కలెక్టర్​గా ఉన్న సి.నారాయణ రెడ్డి డిసెంబర్​లోనే మొదలుపెట్టారు. గట్టమ్మ గుడి వద్ద ప్లాస్టిక్ కాలకేయను ప్రారంభించారు. మేడారం జాతరను ప్లాస్టిక్ రహిత జాతరగా చేయాలని సంకల్పించి అనేక చర్యలు చేపట్టారు.

ఎవరూ ఊహించని రీతిలో...

మున్సిపల్​ ఎన్నికలకు ముందు ఎవరూ ఊహించని రీతిలో నారాయణరెడ్డిని నిజామాబాద్ జిల్లాకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో అదనపు బాధ్యతలు తీసుకున్న భూపాలపల్లి కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు...జాతర పనుల పర్యవేక్షణ చేపట్టారు. అధికారులతో తరచూ సమీక్షలు నిర్వహించారు. మంత్రులు, అధికారుల సమీక్షలు ఎక్కువయ్యాయే.. తప్ప పనులు ముందుకు సాగింది లేదు!

ఓ వైపు భక్తుల రద్దీ పెరుగుతుంటే మరోవైపు పనులు కొనసాగడం విమర్శలకు తావిచ్చింది. పనుల నాణ్యత గాలికొదిలేశారన్న విమర్శలు వచ్చాయి. వెంటనే రంగంలోకి దిగిన ప్రభుత్వం... గత మేడారం జాతర పనులను పర్యవేక్షించిన అనుభవం ఉన్న ఖమ్మం జిల్లా కలెక్టర్​ ఆర్వీ కర్ణన్​కు ములుగు జిల్లా కలెక్టర్​గా అదనపు బాధ్యతలు అప్పగించింది. జాతరకు సమయం దగ్గరపడుతుండటం వల్ల ఆఘమేఘాల మీద వచ్చి కర్ణన్ అదనపు బాధ్యతలు చేపట్టారు. వచ్చీ రాగానే.....మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించారు. క్యూలైన్లలో భక్తుల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. క్యూలైన్ల ఏర్పాటును పరిశీలించారు.

జాతర పనుల ప్రారంభం నుంచి ముగ్గురు కలెక్టర్లను బదిలీ చేయడం చర్చనీయాంశమైంది. గత జాతరను సమర్థవంతగా నిర్వహించిన కర్ణన్​కు అదనపు బాధ్యతలు అప్పగించి వెంటనే బదిలీ చేయటం...ఐటీడీఏ పీవోగా ఉన్న కృష్ణ ఆదిత్యను ములుగు జిల్లా కలెక్టర్​గా నియమించడంపై జోరుగా చర్చసాగుతోంది.

ఇదీ చూడండి:- నిరసనలు ఆకస్మికం కాదు.. విపక్షాల ప్రయోగం: మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.