ములుగు జిల్లాలోని ములుగు, గోవిందరావుపేట, వెంకటాపూర్ మండలాల్లో మూడో విడత ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మొత్తం 220 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మూడు మండలాల్లో మొత్తం 9 లక్షల 89 వేల 494 ఓటర్లు రాజ్యాంగం కల్పించిన తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మూడు మండలాల్లోని పలు గ్రామాల్లో ములుగు జిల్లా కలెక్టర్ వాసం వేంకటేశ్వర్లు పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.
ఇవీ చూడండి: కొనసాగుతున్న స్థానిక సంస్థల తుదిదశ పోలింగ్