ETV Bharat / state

మల్కాజిగిరి డీసీపీ తీరుపై ఎమ్మెల్యే సీతక్క ఆవేదన - police stopped mla seethakka relatives

నిత్యం ఎంతో మంది అభాగ్యులకు అండగా నిలిచే ఎమ్మెల్యే సీతక్క కుటుంబసభ్యులకు మల్కాజిగిరి పోలీసులు చుక్కలు చూపించారు. వారి వాహనానికి అనుమతి ఉన్నా అర్ధగంట సేపు రోడ్డుపక్కన ఆపేశారు. డోంట్​ టాక్​ రబ్బిష్​ అంటూ దురుసుగా ప్రవర్తించారు. విషయం తెలుసుకున్న సీతక్క ఫోన్ ద్వారా మాట్లాడే ప్రయత్నం చేసినా పట్టించుకోలేదని సమాచారం.

మల్కాజిగిరి డీసీపీ తీరుపై ఎమ్మెల్యే సీతక్క ఆవేదన

author img

By

Published : Jun 3, 2021, 12:39 PM IST

మల్కాజిగిరి డీసీపీ రక్షితా మూర్తి తీరుపై ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్​లో చికిత్స పొందుతున్న తన అమ్మకు రక్తం అందించేందుకు వెళ్తున్న తమ బంధువులను అనుమతి ఉన్నా అడ్డుకోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు అరగంట పాటు వారిని రోడ్డుపక్కన నిల్చోబెట్టారని వాపోయారు. తాను వీడియో కాల్​ ద్వారా మాట్లాడేందుకు ప్రయత్నించినా పట్టించుకోలేదన్నారు. ఓ ఎమ్మెల్యేనైన తనకే ఇలాంటి ఇబ్బందులు ఎదురైతే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు.

మల్కాజిగిరి డీసీపీ తీరుపై ఎమ్మెల్యే సీతక్క ఆవేదన

మా అమ్మకు ఆరోగ్యం సీరియస్​గా ఉండి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ములుగు నుంచి బ్లడ్ డొనేట్ చేయడానికి ముందస్తు అనుమతితో వెళ్తున్న మా కుటుంబ సభ్యులను మల్కాజిగిరి డీసీపీ రక్షిత అడ్డుకొని దురుసుగా మాట్లాడారు. అర్ధగంటసేపు రోడ్డుపక్కకు నిలబెట్టారు. నేను వీడియో కాల్ చేసినా మాట్లాడే ప్రయత్నం చేయలేదు. డోంట్ టాక్ రబ్బిష్ అంటూ మా వాళ్లతో దురుసుగా ప్రవర్తించారు.

- సీతక్క, ములుగు ఎమ్మెల్యే

ఇదీ చూడండి: 'కరోనా దోపిడీ' బాధితులకు తిరిగి డబ్బులు ఇప్పిస్తారా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.