ETV Bharat / state

జాతర పనుల పురోగతిని పరిశీలించిన సత్యవతి రాఠోడ్​ - ములుగు తాజా వార్త

ములుగు జిల్లాలోని మేడారం జాతర పనుల పురోగతిని మంత్రి సత్యవతి రాఠోడ్​ పరిశీలించారు. వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

minister satyavathi visit to medaram
జాతర పనుల పురోగతిని పరిశీలించిన సత్యవతి రాఠోడ్​
author img

By

Published : Jan 28, 2020, 4:59 PM IST

మేడారం సమ్మక్క సారలమ్మల వనదేవతలను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్‌ దర్శించుకున్నారు. మేడారం జారతకు సమయం దగ్గర పడుతుండటం వల్ల అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. చిలుకలగుట్ట, జంపన్నవాగు పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆమెతో పాటు గాయని మంగ్లీ వనదేవతల దర్శించుకున్నారు.

జంపన్నవాగు వద్ద మంత్రి కవల పిల్లలను ఎత్తుకొని ముద్దాడటం చూపరులను ఆకట్టుకుంది. అంతకు ముందు ములుగులోని గట్టమ్మ దేవాలయాన్ని సందర్శించి మొక్కులు సమర్పించారు. మేడారం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

జాతర పనుల పురోగతిని పరిశీలించిన సత్యవతి రాఠోడ్​

ఇదీ చూడండి: రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. నలుగురికి తీవ్ర గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.