ETV Bharat / state

Minister Satyavathi Helps Polio Victim : పౌర్ణమి జీవితంలో విరిసిన వెన్నెల.. చిన్నారి కష్టానికి కదిలొచ్చిన సర్కారు

Minister Satyavathi Helps Polio Victim Mulugu : పుట్టుకతోనే పోలియో బారిన పడింది ఓ చిన్నారి. విధి సావాసమో, ఆమె దురదృష్టమో కానీ.. ఆ చిట్టితల్లి ఐదోయేట కన్నతల్లి ప్రేమకు నోచుకోకుండా పోయింది. బాగోగులు చూడవలసిన తండ్రి బాధ్యత మరవటంతో ఆదరణ కరవైంది. పసిప్రాయం నుంచి కష్టాల కడలిలో ఒదిగింది ఆ పాపాయి. తాజాగా వికలాంగుల పింఛను రాక చిన్నారి పడినపాట్లకు మంత్రి సత్యవతి రాఠోడ్ స్పందించారు.

Minister Satyavathi Response to Pournami Issue
Pournami Sad Story in Mulugu
author img

By

Published : Aug 17, 2023, 2:18 PM IST

Pournami Sad Story in Mulugu చీకట్లు ముసిరిన పౌర్ణమికి కాంతులు కురిపించిన మంత్రి సత్యవతి

Minister Satyavathi Helps Polio Victim Mulugu : ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామానికి చెందిన పౌర్ణమి పుట్టుకతోనే పోలియో బారిన పడింది. ఈ చిన్నారి ఐదేళ్ల వయసులో ఉండగానే తల్లి కన్నుమూసింది. పిల్లల బాగోగులు చూడాల్సిన తండ్రి బాధ్యత మరవడంతో పదమూడేళ్ల పౌర్ణమితోపాటు తన సోదరి జ్యోతి మంచీచెడ్డలను నాయనమ్మ కమలమ్మ చూసుకుంటున్నారు.

Polio Victim Pournami Got Pension : నడవలేని స్థితిలో ఉన్న ఈ చిన్నారికి.. ఏడేళ్ల ప్రాయం నుంచి ఏడాది క్రితం వరకు వికలాంగుల పింఛను వచ్చేది. అప్పట్లో అయిదేళ్లు చెల్లు బాటయ్యేలా వికలాంగుల ధ్రువీకరణ పత్రం జారీ అవగా.. ఆ గడువు ముగిసింది. తరవాత సదరం శిబిరాల నిర్వహణలో ఆలస్యం కారణంగా అనుకున్న సమయానికి రెన్యువల్ చేసుకోలేకపోయారు.

మే నెలలో నిర్వహించిన శిబిరంలో ధ్రువపత్రం తీసుకుని ములుగు కలెక్టరేట్​లో సమర్పించినా.. పింఛనును పునరుద్ధరించలేదు. దీంతో 10 నెలలుగా పింఛను అందడంలేదని, వైద్య ఖర్చులకు ఇబ్బందులు పడుతున్నామన్నారు. వీల్​ఛైర్ లేక విరిగిపోయిన చక్రాల కుర్చీలో సోదరి జ్యోతి సహాయంతో పాఠశాలకు వెళ్తోంది. ఎలాగైనా పింఛన్ వచ్చే విధంగా అధికారులు దయచూడాలని కనకమ్మ వేడుకుంటుంది.

ఆ అన్నదమ్ములకు అంతులేని కష్టం.. ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు

BRS Minister Satyavathi Helps Polio Victim Pournami : అమావాస్య చీకటిలో చిక్కుకున్న పౌర్ణమి జీవితంలో వెన్నెల విరిసింది. పసిప్రాయంలో పడుతున్న బాధలను తెలుసుకుని ప్రభుత్వమే కదిలొచ్చింది. ఒకరి సాయంలేనిదే కదలలేని స్థితిలో ఉన్న చిన్నారికి.. తామున్నామని భరోసా కల్పించింది. ములుగు జిల్లా చల్వాయి గ్రామంలో వీల్‌ఛైర్‌కు పరిమితమైన వెన్నెల దీనగాథపై ఈటీవీ-ఈటీవీ భారత్​లో ప్రసారమైన కథనానికి స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్‌(BRS Minister Satyavathi Rathod) స్పందించారు.

"నేను చాలా చదువుకోవాలనుకుంటున్నాను. కానీ నా కాళ్ల పరిస్థితి వల్ల కాస్త కష్టమవుతోంది. నేను చదువుకోవాలంటే మా చెల్లి నాతోనే ఉండాలి. ఎందుకంటే వీల్​చైర్ నెట్టడానికి రావాలి. దాంతో తనకూడా వీల్​చైర్ నెట్టేందుకు చాలా సమస్య అవుతుంది. బడికి పోవటానికి పెన్నులూ, పెన్సిల్లూ లేవు. మా నాన్న కొనివ్వడు. మా కోసం నానమ్మ పడుతున్న కష్టం చూడలేకపోతున్నాం. దయచేసి మాకు సాయం చేయండి." పౌర్ణమి, బాధితురాలు

మంత్రి ఆదేశాలతో రూ. 80వేల విలువ చేసే ఎలక్ట్రిక్‌ వీల్‌ఛైర్‌తో పాటు వికలాంగుల పెన్షన్‌ను(Disability Pension) అధికారులు వెంటనే పునరుద్ధరించారు. పౌర్ణమిని స్వయంగా వీల్ ఛైర్‌లో కూర్చోబెట్టిన మంత్రి.. ఇకపై కష్టాలు ఉండవని భరోసానిచ్చారు. సోదరి జ్యోతి సహాయం లేకుండానే ఇప్పుడు స్వయంగా పౌర్ణమి వెళ్లేలా పనిచేస్తుందని ఇక ఇప్పుడు ఇద్దరికి కష్టాలు ఉండవని మంత్రి చిన్నారులకు ఆప్యాయంగా చెప్పారు. కాసేపు చిన్నారులతో మాట్లాడి వారి యోగ క్షేమాలు తెలుసుకున్న మంత్రి సత్యవతి.. బాగా చదువుకోవాలని వారికి సూచించారు. పౌర్ణమి కష్టం తెలిసిన వెంటనే స్పందించి ఒక్క రోజులోనే సమస్య పరిష్కరించి తమకు అండగా నిలిచారు అంటూ ఆనందం వ్యక్తం చేస్తూ మంత్రి సత్యవతి రాఠోడ్‌కు చిన్నారి కుటుంబ సభ్యులు, స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

65 ఏళ్ల వయసులో జీవనపోరాటం.. కొడుకుల కష్టాలు కడతేర్చేందుకు ఆరాటం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.