ములుగు జిల్లా కన్నెపల్లి నుంచి మేడారానికి బయలుదేరిన సారలమ్మ మరికాసేపట్లో గద్దె మీదకు చేరుకోనుంది. డప్పు వాయిద్యాల నడుమ సారలమ్మను ఊరేగింపుగా పూజారులు తీసుకువస్తున్నారు. గిరిజన సంప్రదాయ పద్ధతిలో జంపన్న వాగు మీదుగా తల్లి రానుంది.
మేడారం పొలిమేర్లకు పగిడిద్దరాజు, గోవిందరాజులు చేరుకున్నారు. మేడారంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాఠోడ్ పర్యటించారు. అమ్మవార్లకు ఇంద్రకరణ్ రెడ్డి నూతన వస్త్రాలు సమర్పించారు. జంపన్నవాగు జనసంద్రంగా మారగా.. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.
ఇవీ చూడండి: మేడారం స్పెషల్: జుట్టు అమ్మకుంటే ఆడాళ్లైనా అరగుండే..!