ETV Bharat / state

వెంకటాపూర్​లో గిరిజనుల కోసం ఆరోగ్య శిబిరం! - తెలంగాణ వార్తలు

ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రంలో గిరిజనుల కోసం ఆరోగ్య శిబిరం నిర్వహించారు. స్థానికంగా నివసిస్తున్న 600 మందికి వైద్య పరీక్షలు చేసి ఉచిత మందులు అందజేశారు. పౌష్టికాహారం లోపం వల్లనే అనారోగ్యం పాలవుతున్నారని వైద్యులు వెల్లడించారు.

medical-camp-for-tribals-at-venkatapur-in-mulugu-district-by-police
గిరిజనులకు కోసం ఆరోగ్య శిబిరం
author img

By

Published : Jan 12, 2021, 7:00 PM IST

ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రంలోని గిరిజనుల కోసం జిల్లా పోలీసులు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. వెంకటాపూర్ మండలంలోని అటవీ ప్రాంతంలో 6 గూడెంలలో నివసిస్తున్న 150 కుటుంబాలకు చెందిన 600 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ గణపతి పాటిల్, ఏఎస్పీ సాయి చైతన్య, ములుగు ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగదీశ్ పాల్గొన్నారు.

గిరిజనులందరికీ ములుగు పోలీసులు తోడుగా ఉంటారని ఎస్పీ సంగ్రామ్ సింగ్ గణపతి పాటిల్ తెలిపారు. అడవి ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనుల్లో చాలామందికి ఆరోగ్యం దెబ్బతింటోందని, మహిళలకు రక్తహీనత లోపాలు ఉన్నాయని డాక్టర్ జగదీశ్ అన్నారు. పౌష్టికాహారం లోపం వల్లనే చాలామంది అనారోగ్యం పాలవుతున్నారని వెల్లడించారు.

అడవుల్లో నివసిస్తూ అనారోగ్యం పాలవుతున్నారని... ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా ములుగులో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి వైద్యం చేయించుకోవాలని ఏఎస్పీ సాయి చైతన్య సూచించారు. గుర్తు తెలియని వ్యక్తులు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. 150 కుటుంబాలకు చీరలు, దుప్పట్లు, పిల్లలకు దుస్తులు పంపిణీ చేశారు.

ఇదీ చదవండి: పండగ సందడి షురూ.. ఛార్జీల మోత మోగనుంది గురూ..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.