ETV Bharat / state

మేడారం జాతర: తాత్కాలిక గుడారాలే సేదతీర్చే కుటీరాలు - medaram 2020

మేడారం జాతర ప్రారంభమైందంటేనే దేవాలయం నుంచి జంపన్నవాగు వరకు చుట్టుపక్కల ప్రాంతాల్లో గుడారాలు వెలుస్తుంటాయి. రెండు మూడు రోజులపాటు అక్కడే ఉండేందుకు జాతరకు వచ్చే భక్తులు వీటిని నిర్మించుకుంటారు. మేడారం, రెడ్డి గూడెం గ్రామస్తులు తాత్కాలిక గుడారాలను నిర్మించి అద్దెకు ఇస్తూ ఉపాధి పొందుతుంటారు.

medaram devotees taking rest in tents
మేడారం జాతర: తాత్కాలిక గుడారాలే సేదతీర్చే కుటీరాలు
author img

By

Published : Feb 6, 2020, 11:16 AM IST

మేడారం అంటేనే లక్షలాది భక్తుల కోలాహలం. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే కుటుంబాలు రెండు,మూడు రోజులు ఇక్కడే ఉండి అమ్మవార్ల గద్దెలను దర్శించుకున్న అనంతరం తిరుగు ప్రయాణం అవుతారు. ఇక్కడ తాత్కాలికంగా సేద తీరేందుకు వెదురు బొంగులతో గుడారాలను నిర్మించుకుంటారు. కానీ ఇది శ్రమతో కూడుకున్న పని.

మేడారం, రెడ్డిగూడెం గ్రామస్తులు వారికి తాత్కాలిక గుడారాలను ఏర్పాటు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. తమ ఇంటి ప్రాంగణంలోని ఖాళీ స్థలాలలో ఎండు కర్రలు, సంచులు, గడ్డిని ఉపయోగించి తాత్కాలిక గుడారాలను నిర్మిస్తున్నారు. జాతరకు వచ్చే వారి కోసం సిద్ధంగా ఉంచుతున్నారు. అందులో ఐదుగురు నుండి 20 మంది వరకు పట్టేంత విశాలంగా సంచులతో తాత్కాలిక గదులను నిర్మిస్తున్నారు. ఐదుగురు పట్టే గదులకు కనీసం 800 రూపాయలు వసూలు చేస్తుండగా.. 20 మంది పట్టే గదులకు 2వేల నుంచి 3వేల రూపాయలు వరకు అద్దె నిర్ణయిస్తున్నారు.

ఈ తాత్కాలిక గదుల్లో ఉండేందుకు భక్తులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. భక్తులకు ఎలాంటి శారీరక శ్రమ అవసరం లేకుండా ఉండటం వల్ల... కుటుంబసభ్యులకు అనుకూలంగా ఉంటే గుడారాలను ఎంచుకుంటున్నారు. ఈ గదుల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ జాతర వాతావరణంతో పోల్చుకుంటే స్వచ్ఛమైన గాలి, ప్రశాంత వాతావరణం ఉండటం వల్ల భక్తులు ఇక్కడ ఉండేందుకు మొగ్గు చూపుతున్నారు.

మేడారం జాతర: తాత్కాలిక గుడారాలే సేదతీర్చే కుటీరాలు

ఇవీ చూడండి: రామప్ప చూడొచ్చు.. లక్నవరం మాత్రం వెళ్లలేము!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.