ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని వెంకటాపురం-భద్రాచలం మార్గంలోని విజయపూర్ కాలనీ సమీపంలో మావోయిస్టు కరపత్రాలు వెలిశాయి. ఈ నెల 25న సంపూర్ణ బంద్ పాటించాలని డిమాండ్ చేస్తూ మావోయిస్టు రాష్ట్ర కమిటీ పేరుతో కరపత్రాలు వెలిశాయి. దీంతో పోలీసులు వాజేడు- వెంకటాపురం రహదారి, ఏటూరునాగారం ముళ్లకట్ట బ్రిడ్జి మీదుగా చత్తీస్గఢ్ రోడ్డు మార్గంలో ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు.
ఇవీ చూడండి: సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలి: సీఎం కేసీఆర్