మేడారం జాతరలో కళ్ల ముందు జరిగిన సన్నివేశాలను బొమ్మల రూపంలో చిత్రీకరిస్తూ పోచం అనే కళాకారుడు ఔరా అనిపిస్తున్నాడు. మంచిర్యాల జిల్లా చెన్నూరుకు చెందిన పోచం 2017లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ కళాయాత్ర పేరుతో చేపట్టాడు.
యాత్రలో భాగంగా గుజరాత్లోని రానాఆఫ్కచ్, రాజస్థాన్లోని పుష్కర మేళ వంటి ప్రాంతాలను సందర్శించి.. అక్కడ ఉండే గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా అందమైన చిత్రాలను ఆవిష్కరించారు. మొత్తం నాలుగు రాష్ట్రాలు సందర్శించిన ఈ యువకుడు అక్కడ చూసిన అనేక పరిస్థితులను బొమ్మల రూపంలో అందంగా తీర్చిదిద్దాడు. ప్రభుత్వం సహకరిస్తే వీటన్నింటిని ఒకచోట చేరుస్తూ పుస్తకాన్ని విడుదల చేస్తానని ఆయన చెబుతున్నాడు.