ETV Bharat / state

జంపన్న వాగుకు ఆ పేరు ఎలా వచ్చిందంటే! - మేడారం జాతర

మేడారం మహాజాతరలో జంపన్న వాగు ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఈ వాగులో పుణ్యస్నానాలు ఆచరించిన తరువాతే... అమ్మలను దర్శించుకోవడం.. సంప్రదాయం. జంపన్నవాగులో స్నానమాచరిస్తే వ్యాధులు తొలగిపోతాయని, సమ్మక్క-సారలమ్మల చల్లని చూపు తమపై ఉంటుందని భక్తుల నమ్మకం. జంపన్న వాగు అసలు పేరు సంపెంగ. మరి ఆ వాగుకు జంపన్న అనే పేరెలా వచ్చింది. వాగు ప్రాశస్త్యం ఏమిటో తెలుసుకుందామా!

How did the sampenga vagu's name changed to Jampanna Vagu at medaram in mulugu district
జంపన్న వాగుకు ఆ పేరు ఎలా వచ్చిందంటే!
author img

By

Published : Feb 3, 2020, 1:41 PM IST

" ఒకప్పుడు జంపన్న వాగుకు సంపెంగ అని పేరు. కాకతీయ రాజు ప్రతాపరుద్రుని చేతిలో సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులు మరణించారు. కాకతీయ సైన్యంతో...వీరోచితంగా పోరాడిన జంపన్నను హతమార్చేందుకు వారు దొంగదెబ్బ తీస్తారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న జంపన్న, శత్రువుల చేతిలో ప్రాణాలు కోల్పోవడం అవమానకరంగా భావించి.. అక్కడే ఉన్న సంపెంగ వాగులో దూకి ప్రాణత్యాగం చేస్తాడు. అప్పటి నుంచి సంపెంగవాగు జంపన్నవాగుగా మారింది."

జంపన్న వాగుకు ఆ పేరు ఎలా వచ్చిందంటే!

మేడారం జాతరకొచ్చే భక్తులకు జంపన్న వాగు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. జాతరలో... రద్దీ ఎలా ఉందో... వాగు పరిసర ప్రాంతాలను చూస్తే తెలుస్తుంది.

తండోపతండాలుగా వచ్చిన భక్తులతో జంపన్న వాగు పరిసరాలు కిటకిటలాడతాయి. కాలు పెట్టే చోటు కూడా ఉండదంటే అతిశయోక్తి కాదు. నిండుగా ప్రవహించే జంపన్న వాగును... చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది.

జాతరకు నాలుగు రోజుల ముందు... లక్నవరం సరస్సు నుంచి వచ్చే జలాలతో ఈ వాగు జలకళ సంతరించుకుంటుంది. ఇందులో స్నానాలు ఆచరించి దర్శించుకుంటే.. సమ్మక్క చల్లని చూపు తమపై ఉంటుందని భక్తుల విశ్వాసం.

అందుకే జంపన్న వాగులో స్నానం చేసిన తర్వాతే భక్తులు... గద్దెల వద్దకు వెళ్లి అమ్మవార్లను దర్శించుకుంటారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.