ETV Bharat / state

‘కొండపోచమ్మ’కు.. వడివడిగా గోదారి

కొండపోచమ్మ సాగర్‌లోకి గోదావరి జలాలు వడివడిగా వచ్చి చేరుతున్నాయి. 15 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ జలాశయంలోకి శనివారం ఒక టీఎంసీ నీరు చేరినట్లు కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్లు తెలిపారు. సాగర్‌లో నీటిమట్టం పెరగడంతో పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది.

‘కొండపోచమ్మ’కు.. వడివడిగా గోదారి
‘కొండపోచమ్మ’కు.. వడివడిగా గోదారి
author img

By

Published : Jun 14, 2020, 7:23 AM IST

కొండపోచమ్మ సాగర్‌లోకి గోదావరి జలాలు వడివడిగా వచ్చి చేరుతున్నాయి. మే 29న సీఎం కేసీఆర్‌ పంపింగ్‌ ద్వారా నీటి సరఫరాను ప్రారంభించిన విషయం తెలిసిందే. రంగనాయక సాగర్‌ నుంచి వస్తున్న గోదావరి జలాలను తుక్కాపూర్‌, అక్కారం, మర్కూక్‌ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పంపుల ద్వారా ఎత్తి కొండపోచమ్మ సాగర్‌కు తరలిస్తున్నారు. ఇక్కడ ఆరు పంపులు ఏర్పాటు చేయగా ఎగువ నుంచి వస్తున్న నీటి లభ్యత మేరకు రెండు పంపులు నడుపుతున్నారు. 15 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ జలాశయంలోకి శనివారం ఒక టీఎంసీ నీరు చేరినట్లు కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్లు తెలిపారు. సాగర్‌లో నీటిమట్టం పెరగడంతో పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. శుక్రవారం సీఎం కేసీఆర్‌ చెరువు కట్టను పరిశీలించి అధికారులకు పలు సలహాలు సూచనలు ఇచ్చారు. ఇటీవలి వర్షాలకు ప్రవాహం పెరగడంతో త్వరలోనే నీటి సరఫరాను పెంచనున్నట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం కొడకండ్ల వద్ద వరద కారణంగా స్వల్పంగా కాలువ గట్టు దెబ్బతిన్నా ఎత్తిపోతలకు ఆటంకం కలుగలేదు. యథాప్రకారం 700 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది.
నాలుగు పంపుల ద్వారా ఎత్తిపోతలు
తొగుట మండలం తుక్కాపూర్‌లోని కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ-12 మల్లన్నసాగర్‌ సొరంగంలోని పంప్‌హౌస్‌ వద్ద శనివారం ఏకకాలంలో 4 పంపుల ద్వారా నీటిని ఎత్తిపోశారు. ఇక్కడ నీరు ఎత్తిపోతలకు 43 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 8 పంపులు ఏర్పాటు చేయగా 30 నిమిషాలు 4 పంపుల ద్వారా గోదావరి నీటిని గజ్వేల్‌ మండలం అక్కారంలోని సర్జిపూల్‌కు తరలించారు. ప్రాజెక్టు ఎస్‌ఈ ఆనంద్‌, డీఈ రవీందర్‌లు పర్యవేక్షించారు.

ఇవీ చూడండి: పోలీసులా..? కల్వకుంట్ల సైన్యమా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.