ములుగు జిల్లాలో నకిలీ బంగారం, వజ్రాలు అమ్ముతూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసినట్లు ఎస్పీ సాయి చైతన్య తెలిపారు. జిల్లా పరిధిలోని వెంకటాపురం మండలం పాలంపేట సమీపంలోని ఇబ్రహీం బాబా ఫౌల్ట్రీ ఫాంలో... గంజాయి ఉందనే సమాచారంతో సిబ్బందితో కలిసి ఎస్సై నరహరి తనిఖీ చేశారు. గంజాయితో పాటు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
ఇబ్రహీం బాబా అనే వ్యక్తి తక్కువ ధరకే బంగారం, వజ్రాలు కిలోల చొప్పున అమ్ముతానని నమ్మించి ప్రజల నుంచి లక్షలాది రూపాయలు తీసుకొని మోసం చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. నకిలీ బంగారం ఇచ్చారని నిలదీస్తే... తుపాకీతో బెదిరించినట్లు వివరించారు. నిందితులు వీరన్న, రవిచందర్‌ను అదుపులోకి తీసుకోగా... ఇబ్రహీం, తిరుపతి పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. వీరి నుంచి 110కిలోల గంజాయి, ఒక డమ్మీ పిస్తోల్, కారు, ఆరు సెల్ఫోన్లు, నకిలీ డైమండ్స్, బంగారం, 10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు.
ఇవీ చూడండి : కిడ్నాప్ కేస్ - నాన్న ఫోన్ నెంబర్ గుర్తుంది.. కాల్ చేశా..!