భాజపా అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సేవాహి సంఘటన్ కార్యక్రమంలో భాగంగా భోజన వితరణ కార్యక్రమాన్ని ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ములుగు జిల్లా కేంద్రంలో లాక్డౌన్ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి నగరపు రమేశ్ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు.
లాక్డౌన్లో ప్రజలకు పౌష్టికాహారాన్ని అందించాలన్న ఆలోచనతో ఒక్క పూట భోజనాన్ని భాజపా ఆధ్వర్యంలో అందించారు. జిల్లా కేంద్రంలోని మల్లంపల్లి, జంగాలపల్లి చెక్ పోస్టుల వద్ద పారిశుద్ధ్య కార్మికులు, యాచకులు, బాటసారులకు సుమారు 400 మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.