ETV Bharat / state

ప్రశ్నార్థకంగా మారుతున్న అడవుల మనుగడ

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు.. అడవులు పెంచండి పర్యావరణాన్ని కాపాడండి అంటూ నినాదాలు చేస్తున్నాం. కానీ ఆచరణలో మాత్రం కనిపించదు. నిత్యం కళ్లెదుటే వందలాది ఎకరాల కారడవి కాలి బూడిదైపోతోంది. అధికారుల నిర్లక్ష్యం వనాల పాలిట శాపంగా మారింది. వ్యక్తిగత స్వార్థంతో మనం చేసే పనుల వల్ల అడవులన్నీ బూడిదై పోతున్నాయి.

author img

By

Published : Mar 25, 2019, 9:59 AM IST

Updated : Mar 25, 2019, 7:04 PM IST

ఆవిరవుతోన్న అరణ్యాలు
ఆవిరవుతోన్న అరణ్యాలు
అడవులు మానవ మనుగడకు నిలయం. కాలుష్య నివారణకు మార్గాలు. అడవులు లేని ప్రపంచాన్ని ఊహించలేం. మన రాష్ట్రంలోనే ములుగు జిల్లాలో విస్తారమైన అటవీప్రాంతం ఉంది. ములుగు, వెంకటాపురం, గోవిందరావుపేటతో సహా పలు మండలాల్లో అడవులు విస్తరించాయి. శిశిర రుతువు వచ్చిందంటే ఆకులన్నీ నేలరాలుతాయి. పశువులను మేపడానికి అరణ్యాల్లోకి తీసుకెళ్లేవారు బీడీలు, చుట్టలు తాగి పడేయడం వల్లనిప్పు అంటుకొని అడవులు తగలబడుతున్నాయి.

తునికాకు గుత్తేదారుల పనేనా..!

వారం కిందట తాడ్వాయి మండలం బంధాలలో పట్టపగలే అడవిలో నిప్పురాజుకుని సమీపంలో ఉన్న ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. తునికాకు సేకరణకోసం గుత్తేదారులే అడవులను తగలబెట్టిస్తున్నారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒక ప్రాంతంలో నిప్పురాజేస్తే ఏకబికిన వందల ఎకరాలు బూడిదవుతున్నాయి.

పదేళ్ల కిందట బయ్యక్కపేట ప్రాంతంలో ఎంతో దట్టమైన అడవి ఉండేదని అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పుడంతా మైదానంగా మారిందని స్థానికులు వాపోతున్నారు.

హరితహారం పేరుతో కోట్లాది మొక్కలు నాటినప్పటికీ అడవుల సంరక్షణ కూడా కీలకమే. ఎండాకాలంలో అగ్నిప్రమాదాలకు ఆస్కారం ఉన్నప్పుడు అటవీ అధికారులే జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే పర్యావరణ సంక్షోభం తప్పదు.

ఇదీ చదవండి:ఆ లోక్​సభ స్థానాలు తప్పకుండా గెలవాల్సిందే..!

Intro:tg_wgl_51_23_adavilo_mantalu_pkg_c7_HD
G Raju mulugu contributer

యాంకర్ : మండుటెండలో కొద్దిగా చెట్టు నీడ కనిపిస్తేనే ప్రాణం లేచి వచ్చినట్లువుతుంది... దాని చల్లని నీడన కాసేపు ఉండి అమ్మయ్య అనుకుంటూ సేదతీరుతాం. కేవలం నీడను ఇవ్వడమే కాదు అవి మన జీవితంలో ఒక భాగం అని మారుస్తున్నాం. ఎవరి స్వార్థమో తెలియదు కానీ అడివి అంతా నిప్పంటుకొని చిన్న మొక్కలు సైతం ఆ మంటలకు కాలి బూడిద అవుతున్నాయి. అలాగే అడవి ని ఆనుకుని ఉన్న గుడాలు నిప్పంటుకొని కాలి పోతున్నా ... నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు అడవి శాఖ అధికారులు

Body:వాయిస్ : అడవులు మానవ మనుగడకు నిలయం.. అడవులు ఉంటేనే కాలుష్య నివారణకు తోడు అవుతుందని అర్థం అడవులు మన జీవితానికి మన జీవితానికి గల అవినాభావ సంబంధం ఏమిటో అర్థమవుతుంది అడవులు లేని ప్రపంచాన్ని ఊహించలేం చెట్లు మన జీవితానికి మెట్లు అని మరవద్దు మన రాష్ట్రంలోనే ములుగు జిల్లాలో అడవి విస్తారంగా ఉంది. ములుగు, వెంకటాపురం, గోవిందరావుపేట, తాడ్వాయి, మంగపేట, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం మండలాల్లో విస్తీర్ణమైన అడవి ఉంది. వేసవి కాలం వచ్చిందంటే చాలు అడవిలో ఆకులన్నీ రాలుతుంటాయి. నిత్యం పశువుల మేతకు వెళ్లే వ్యక్తులు బీడీలు, చుట్టలు తాగి పడేయడంతో ఆకులలో నిప్పు అంటుకొని వీచే గాలులకు మంటలు చెలరేగి అడివి అంతా కాలుతున్నాయి. వచ్చే నెలలు తునికాకు సేకరణ జరిగింది. అడవిని తగలబెడితే తునికాకు మరింత ఆకు సేకరణ అవుతుందని తునికాకు గుత్తేదారు కూడా తగలబెట్టే ఉంటారని గూడెం వాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రాంతంలోని పట్టుకుంటే అడివి అంతా వీచే గాలులకు ఎరగడు పడిపోయి చిన్న చిన్న మొక్కలు కాలి బూడిదైపోతుంది. అడవి నిప్పంటుకొని ఎరుగడు పడి ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న గూడెం వాసుల ఇండ్లు అగ్నికి ఆహుతయ్యాయి. గత వారం రోజుల క్రితమే తాడువాయి మండలం బంధాల గ్రామానికి చుట్టూ ఉన్న అడవిలో పట్టపగలే నిప్పంటుకొని ఉండడంతో వీచే గాలులకు కాలిన దిబ్బలు లేసి ఓ ఇంటి పై పడడంతో కాలుతూ మరో నాలుగేళ్ల పై పడి పట్టపగలే ఎవరు లేని సమయంలో కాళీ బూడిదైపోయాయి. పచ్చదనం పరిశుభ్రత అని హరితహారం పేరుతో కోట్లాది మొక్కలు నాటినప్పటికీ కనీసం 10 శాతం మొక్కలు కూడా జీవం పోసింది లేదు. అడవి తగలబడ్డ గుండా తగు జాగ్రత్తలు చర్యలు చేపట్టి, ఒకవేళ నిప్పంటుకొని అడవి కాలుతుంటే మంటను చల్లార్చే విధంగా అడవి శాఖ వాళ్ళు ఏర్పాట్లు చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పదేళ్ల క్రితం బయ్యక్కపేట గ్రామ ప్రాంతంలో ఎంతో దట్టమైన అడవి ఉండేదని అడవిని నరికి పోడు చేసుకుంటున్నారని ఇప్పుడు చేసుకున్న వ్యక్తి దగ్గర అటవీశాఖ అధికారులు డబ్బులు తీసుకుంటున్నారని, ఇప్పుడు చేసుకుంటున్నారని తెలిసిన అడవి శాఖ అధికారులకు తెలిసిన అప్పటికి కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అడవి ప్రాంతంలో నివసిస్తున్న గ్రామస్తులు అంటున్నారు.

Conclusion:బైట్స్ 1 : విశ్వనాధ్ ప్రవేట్ ప్రైవేటు స్కూల్ టీచర్
2 : రాహుల్ బయట పేట
Last Updated : Mar 25, 2019, 7:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.