అకాల వర్షాలతో చేతిదాకా వచ్చిన పంటలు నీటి పాలయ్యాయి. ఆరుగాలం పడిన శ్రమంతా వర్షార్పణం అవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ములుగు జిల్లాలోని పలు మండలాల్లో నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. చేతికొచ్చిన యాసంగి పంట తడిసి ముద్దయింది.
యాసంగి పంట కోతలు ప్రారంభం అయ్యాయి. కోసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోశారు. పదిహేను రోజులకు పైగా ఆరబోసిన ధాన్యానికి 17 తేమ శాతం వచ్చినా ఇంకా కొనుగోలు చేయడం లేదని రైతులు వాపోయారు. ఐకేపీ, జీసీసీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కేంద్రాల్లో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: ఉగాది పండక్కి నోరూరించే వంటలు..!