ములుగు జిల్లాలో ఆబ్కారీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తాడ్వాయి మండలం నార్లపూర్లో సోదాలు చేస్తుండగా ముగ్గురు యువకులు రెండు ద్విచక్ర వాహనాలపై 110 కిలోల నల్లబెల్లం తరలిస్తుండగా వారిని పట్టుకున్నారు. బెల్లం, వాహనాలను స్వాధీనం చేసుకొని వారిని స్టేషన్కు తరలించారు.
గోవిందరావుపేట మండలం పాపయ్యపల్లి గ్రామ సమీపంలో ద్విచక్రవాహనంపై ఏడు లీటర్ల నాటుసారాను తరలిస్తుండగా అధికారులు అడ్డుకున్నారు. దీనివల్ల వాహనం నడుపుతున్న వ్యక్తి పారిపోవటం వల్ల వెనక కూర్చున్న మహిళలను అదుపులోకి తీసుకొని నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెను స్టేషన్కు తరలించారు.