ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని జలగలంచ, గుత్తి కోయ గూడెంలోని గిరిజనులకు రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ బోర్డ్ ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. దగ్గుపాటి రాణా పంపించిన వస్తువులను ఎమ్మెల్యే సీతక్క గిరిజనులకు అందించారు.
శీతాకాలంలో తీవ్ర ఇబ్బంది పడుతున్న ఆదివాసులకు.. దగ్గుపాటి ట్రస్ట్ నుంచి దుప్పటి, నిత్యవసర సరకులు అందించిన నటుడు రాణాకు ఎమ్మెల్యే సీతక్క కృతజ్ఞతలు తెలిపారు.