medaram jathara: ఆసియాలోనే అతిపెద్ద జాతరైనా మేడారం సమ్మక్క-సారలమ్మ వనదేవతల దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలలతో పాటు సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆది, బుధ, గురువారాల్లో లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించుకుని అమ్మ దర్శించుకున్నారు. కోరిన కోరికలు తీర్చిన తల్లులకు పసుపు, కుంకుమ చీరలు కట్టి కొబ్బరికాయలు కొట్టి మనసార తల్లులను మొక్కుతూ తిరుగు ప్రయాణం చేస్తున్నారు.
మేడారం, ఊరట్టం, నార్లపూర్, కొత్తూరు పరిసర ప్రాంతాల్లో విందు భోజనం చేస్తూ ఉల్లాసంగా గడిపి సాయంత్రం సమయానికి ఇంటికి పయనమయ్యారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని సెలవులు ఉన్న రోజుల్లో భక్తులు అమ్మవార్ల దర్శనానికి తండోపతండాలుగా తరలివచ్చారు.
పారిశుద్ధ కార్మికులతో శుభ్రం
మేడారం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో భక్తులు విందు చేసి వదిలేసిన చెత్త, చెదారాన్ని పారిశుద్ధ కార్మికులతో తొలగిస్తున్నారు. మేడారం బస్టాండ్ సమీప అడవిలో భక్తులు తిని పారేసిన చెత్త, చెదారాన్ని మేడారం గ్రామ సర్పంచ్ 40 మంది పారిశుద్ధ్య కార్మికులతో తొలగిస్తున్నారు.
నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షాలకు మేడారం పరిసర ప్రాంతాలని బురద సమయం కావడంతో దుర్వాసన వీరజిల్లకుండా ముందస్తుగానే చెత్త, చెదారాన్ని తొలగించి బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నామని జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య అన్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో భక్తులు ముందస్తుగానే మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల దర్శించుకుంటున్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. జాతర పరిసరాల్లో హైడ్రోక్లోరిన్ ద్రావనాన్ని పీచికారి చేస్తున్నామని అన్నారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మేడారం పరిసరాల్లో పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరిగేలా చూస్తున్నామని.. ఆలయంలోని చెత్త, చెదారాన్ని డంపింగ్ యార్డుకు తరలిస్తున్నామని జిల్లా పంచాయతీ రాజ్ అధికారి వెంకయ్య అన్నారు. జాతరలో ఉన్న దుకాణదారులు, మాంస విక్రయదారులు వ్యర్థాలను కుందిలాల్లో వేయాలని మీరు ఉన్న ప్రదేశాలను శుభ్రంగా ఉంచాలని సూచించారు.
ఇదీ చూడండి: