ములుగు జిల్లా జాకారం గ్రామ సమీపంలోని పొలాల్లో కంకి విరిచిన మొక్కజొన్నకు నిప్పంటుకొని పూర్తిగా దగ్ధమైంది. పొలంలోనే కల్లం చేసి కాంటైన ధాన్యం బస్తాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఎగిసిపడుతున్న మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా ఫలితం లేకపోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అప్పటికే బస్తాలు చాలా వరకు కాలిపోయాయి.
ఎంతో శ్రమ పడి పండించిన పంట కలిపోవడాన్ని చూసి రైతులు కన్నీరు పెడుతున్నారు. ఈ ప్రమాదంలో లక్షా 60 వేల రూపాయల విలువ గల 180 మొక్కజొన్న బస్తాలు బుగ్గి పాలైనట్టు బాధిత రైతులు తెలిపారు.