మేడారం జాతరకు దేశ నలుమూలల నుంచి భక్తులు తరలొస్తుంటారు. ఈ అతిపెద్ద జాతరను ఓ వాషింగ్ మెషిన్ల కంపెనీ మంచి మార్కెటింగ్ మార్గంగా ఎంచుకుంది. భక్తులకు ఉచితంగా బట్టలు ఉతికిస్తామంటూ ముందుకొచ్చింది. జనసంద్రంగా మారిన జాతరలో భక్తులకు సేవ చేస్తే పుణ్యానికి పుణ్యం..తమ ఉత్పత్తులపై ప్రజలకు నమ్మకం కలిగించొచ్చని ఇలా వెరైటీగా మార్కెటింగ్ చేస్తోంది.
దాంతో పాటు ఉచిత తాగునీరు, మాస్క్లు పంపిణీ చేస్తుంది. మేడారానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం 40 వాటర్ ప్యూరిఫైయర్లు, 30 వాషింగ్ మిషన్లను ఏర్పాటు చేసింది.
ఈ ఉచిత సేవలు జాతర అయిపోయే వరకు కొనసాగిస్తామని ఆ కంపెనీ ప్రతినిధి మోహర్ తెలిపారు. ఉచితంగా బట్టలు ఉతికిస్తుండటంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.