Central Tribal University in Telangana 2023 : ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మేడారం వనదేవతల నిలయమైన ములుగు జిల్లాలో గిరిపుత్రుల కోసం చదువుల కేంద్రం ఏర్పాటు కానుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో గిరిజన విశ్వవిద్యాలయాలు ఏర్పాటు(Tribal University) చేస్తామని రాష్ట్ర విభజన సమయంలో కేంద్రంలోని అప్పటి ప్రభుత్వం ఇచ్చిన హామీ.. తొమ్మిదేళ్ల తర్వాత నెరవేరనుంది. సమ్మక్క-సారలమ్మ పేరుతో ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నట్టు పాలమూరు వేదికగా ప్రధాని ప్రకటించారు.
"ములుగు జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం నిర్మించబోతున్నాం. దీనికి సమ్మక్క-సారలమ్మ పేరు పెడతాం. రూ.900కోట్లో నిర్మిస్తాం.- నరేంద్ర మోదీ, భారతదేశ ప్రధాన మంత్రి
Central Tribal University in Mulugu 2023 : రాష్ట్ర విభజన చట్టంలోని హామీని గాలికొదిలేశారా.. అని అనుకుంటున్న తరుణంలోనే ప్రధాని చేసిన ప్రకటనతో.. సుదీర్ఘ కాలంగా ఉన్న అపోహలకు తెరపడింది. ములుగు సమీపంలోని గట్టమ్మ గుడి పరిసర ప్రాంతాల్లో 335 ఎకరాల స్థలాన్ని వర్సిటీ కోసం సేకరించారు. భూసేకరణ కోసం గిరిజన సంక్షేమ శాఖ రూ.10 కోట్లలను కేటాయించింది. పలుమార్లు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(Hyderabad Central University) ప్రతినిధులు వచ్చి స్థలాన్ని పరిశీలించి, అనువుగానే ఉందని నిర్ధారించి సంతృప్తి చెందారు.
Sammakka Saralamma Tribal University 2023 : రాష్ట్ర ప్రభుత్వం కూడా భూసేకరణ పూర్తైందని.. తక్షణమే పనులు మొదలుపెట్టాలంటూ కేంద్ర సర్కార్‌కు పలుమార్లు నివేదించింది. ఈ క్రమంలోనే కేంద్ర బృందం రెండు సార్లు పర్యటించి నివేదిక అందజేసింది. తాత్కాలిక తరగతుల నిర్వహణ కోసం ములుగు మండలం జాకారంలో గిరిజన యువజన శిక్షణా కేంద్రం భవనాలు అనువుగా ఉంటాయని భావించారు. అన్ని సిద్ధమైనా యూనివర్సిటీ ఏర్పాటుకు అడుగు కూడా ముందుకు పడలేదు. ఇక రాదనే అంతా భావించిన తరుణంలో ప్రధాని ప్రకటన.. జిల్లా వాసులను హర్షాతిరేకాల్లో ముంచెత్తింది. కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో బీజేపీ నేతలు ములుగులో ర్యాలీ నిర్వహించారు.
'రాష్ట్రానికి గిరిజన విశ్వవిద్యాలయం, పసుపు బోర్డు' ప్రకటించిన ప్రధాని
Central Tribal University in Telangana : రాష్ట్ర విభజన కాలం నాటి కల సాకారం అవుతుండటంతో తమ ప్రాంతం మరింత అభివృద్ధి చెందటమే కాకుండా, విద్యావకాశాలు మరింత మెరుగుపడతాయని గిరిజన, ఆదివాసీ సంఘాలు భావిస్తున్నాయి. స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలని, దీనిపై త్వరలోనే కేంద్ర సర్కార్‌కు లేఖ రాయనున్నట్టు బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ సీతారాంనాయక్ తెలిపారు. ఇకపై ఎంత మాత్రం జాప్యం చేయకుండా.. వర్సిటీ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని పలు సంఘాల నేతలు కోరుతున్నారు.
వర్సిటీ ఏర్పాటుపై సందేహాలు తొలగినా.. ప్రవేశాల విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం రాలేదు. ఈ విద్యా సంవత్సరంలోనే తరగతులు ప్రారంభమవుతాయా లేదంటే వచ్చే విద్యాసంవత్సరంలో జరుగుతాయా అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఏదేమైనా వర్సిటీ ఏర్పాటుతో ములుగు జిల్లా ముఖచిత్రమే మారిపోయే అవకాశాలు మాత్రం ఉన్నాయి.
గిరిజన విశ్వవిద్యాలయానికి మోక్షం వచ్చేను.. అన్నీ అనుకూలతలే..
'గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు.. పార్లమెంట్లో బిల్లు పెట్టాలి'