ETV Bharat / state

ప్రకృతి ఒడిలో.... బొగత జలపాతం చూడతరమా! - water falls

చూట్టూ ఎత్తైన కొండలు. దట్టమైన అటవీ ప్రాంతం. ప్రకృతి నడుమ కనువిందు చేసే సుందర దృశ్యాలు. మేనిని తాకే మంచు ముత్యాల్లా.. పర్యటకులను కట్టిపడేస్తున్న అద్భుత దృశ్యం. ఇలా ప్రకృతి సౌందర్యాన్ని పరవశింపజేస్తూ నింగి నుంచి నేలకు జాలువారిన పాలసంద్రంలా మారిన బొగత జలపాతం కనువిందు చేస్తోంది. ఇక్కడి ప్రకృతి అందాలు సందర్శకుల మనసు దోచుకుంటున్నాయి. కొండ కోనల నుంచి హోరెత్తే నీటి హొయలతో జాలువారే బొగత జలపాతంపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

ప్రకృతి ఒడిలో.... బొగత జలపాతం చూడతరమా!
author img

By

Published : Aug 11, 2019, 9:52 PM IST

తెలంగాణ నయాగరాగా పేరొందిన బొగత జలపాతానికి సందర్శకుల తాకిడి పెరుగుతోంది. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న ఈ జలపాతానికి... ఈసారి కాస్త ఆలస్యంగా జలకళ వచ్చింది. ప్రధానంగా ఎగువ ప్రాంతంలోని ఛత్తీస్​గఢ్​లో వర్షాలు పడుతుండటం వల్ల... జలధారలు కనువిందు చేస్తున్నాయి.

బొగత సోయగాలు చూడతరమా!
బొగత అందాలు

కొండకోనల్లనుంచి వడివడిగా పరుగులు తీస్తోన్న జలధారలు... సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. గత రెండు వారాల నుంచి బొగతకు పర్యటకుల తాకిడి పెరిగింది. వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ నుంచే కాకుండా ఛత్తీస్​గఢ్​, మహారాష్ట్రల నుంచి కూడా పర్యటకులు వస్తున్నారు. కుటుంబ సమేతంగా, స్నేహితులతో వచ్చిన వారంతా... బొగత అందాలను ఆస్వాదిస్తున్నారు. బొగత జలాల్లో జలకాలాడుతూ ఉల్లాసంగా గడిపేస్తున్నారు.

సౌకర్యాలను కల్పించాలి

అటవీ శాఖ నిర్మించిన రోప్​వేలో పర్యటకులను ఆకట్టుకుంటోంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో రాత్రిపూట బస చేసేందుకు వన కుటీరాలు నిర్మించాలని పర్యటకులు చెబుతున్నారు. రవాణా సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: చూపరులను కట్టిపడేస్తున్న అలుగు వాగు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.