మేడ్చల్ జిల్లాలోని మేడ్చల్, గుండ్ల పోచంపల్లి, తూముకుంట మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం 63 మంది నామపత్రాల ఉపసంహరణ చేసుకున్నారు. మేడ్చల్లో మొత్తం 23 వార్డులకు 119 పోటీలో ఉండగా... 28 మంది నామ పత్రాలు ఉపసంహరించుకున్నారు.
గుండ్ల పోచంపల్లి పురపాలిక పరిధిలో 15 వార్డులకు 35 మంది పోటీలో ఉండగా... 18 మంది నామపత్రాలు ఉపసంహరించుకున్నారు. తూముకుంట పురపాలిక పరిధిలో మొత్తం 16 వార్డులకు 75 మంది పోటీలో ఉండగా... 17మంది ఉపసంహరణ చేసుకున్నారు.
ఇవీ చూడండి: నేడు భారీగా నామినేషన్ల ఉపసంహరణ!