మేడ్చల్ జిల్లా బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని సాయి భవాని కాలనీలో ఈ ఏడాది కొత్తగా మద్యం దుకాణం మంజూరైంది. మద్యం దుకాణం ఏర్పాటుకు సదురు వ్యాపారి గది అద్దె కోసం గాలించాడు. ఇంటి యజమానులు ఎవరు ముందుకు రాకపోవడం వల్ల సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో రెండు గదుల నిర్మిస్తున్నాడు. విషయం తెలుసుకున్న కాలనీవాసులు ఆందోళనకు దిగారు. అధికారులు చెప్పిన పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం దుకాణం ఏర్పాటు చేయడంవల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. మద్యం దుకాణం ఏర్పాటు నిర్ణయం విరమించుకునే వరకు పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు.
ఇవీ చూడండి;బాలమిత్ర పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించిన సీపీ మహేశ్ భగవత్