కూకట్పల్లి వివేకానందనగర్ డివిజన్ తెదేపా అభ్యర్థి సామ్రాజ్యం పలు ప్రాంతాల్లో ప్రచారం చేశారు. తెరాస ప్రభుత్వ వైఫల్యాలే తమకు విజయాన్ని అందిస్తాయని చెప్పారు. గత ఆరు సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు.
తాను కార్పొరేటర్‌గా ఉన్న సమయంలోనే డివిజన్లో మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. ప్రస్తుతం నగరంలో ఎక్కడ చూసినా సమస్యలు తాండవిస్తున్నాయని చెప్పారు. తనకు అవకాశం కల్పిస్తే ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: గల్లీ పార్టీ కావాలా.. దిల్లీ పార్టీ కావాలా: కేటీఆర్