లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర ఎమ్మార్వోగా నాగరాజు ఉన్న సమయంలో జారీ చేసిన పట్టా పాస్ పుస్తకాలను రద్దు చేయాలంటూ కొందరు బాధితులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. వీరికి మద్దతుగా కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు నిరసనలో పాల్గొన్నారు.
ఆ తహసీల్దార్ జారీచేసిన పట్టా పాసుపుస్తకాలను తీసేసి బాధిత రైతులకు న్యాయం చేయాలని కొత్త పాస్ పుస్తకాలను ఇవ్వాలని వారు ఆందోళన చేశారు. ఎమ్మార్వో వచ్చి తమకు హామీ ఇచ్చేవరకు అక్కడి నుంచి వెళ్లేదిలేదని భీష్మించుకు కూర్చున్నారు.
ఇవీ చూడండి: రఫేల్ జెట్ల విన్యాసాలు- శత్రువుల గుండెల్లో గుబులు