దేశాన్ని కాపాడేందుకు సరిహద్దుల్లో సైనికులు చేస్తున్న కృషి ఎనలేనిదని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy in Sainik Vandan) అన్నారు. వారికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. హైదరాబాద్ కూకట్‌పల్లిలో భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన సైనిక్ వందన్ కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. కూకట్పల్లి పీఎన్‌ఎం పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
భయం పుట్టించారు
భారత సరిహద్దుల్లో ఉగ్రవాదుల చొరబాటును మన సైనికులు ప్రాణాలకు తెగించి అడ్డుకుంటున్నారని కిషన్(union minister kishan reddy latest news) అన్నారు. తమ జోలికొస్తే చంపేస్తారనే భయాన్ని కలిగించారని పేర్కొన్నారు. సర్జికల్ స్ట్రైక్ల ద్వారా పాకిస్థాన్ స్థావరాలను మన సైనికులు నాశనం చేశారని గుర్తు చేశారు. జవాన్ల కుటుంబాలకు భారత్ సైనిక్ వికాస్ పరిషత్ సేవ చేస్తుందని కిషన్ రెడ్డి అన్నారు. సైనికులకు కేంద్రం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని స్పష్టం చేశారు.
వికలాంగులు అనే పదాన్ని తొలగించి.. దివ్యాంగులు అని సంబోధించాలి. వారిలో ఆత్మగౌరవాన్ని పెంచాలే కాని.. వారు కృంగిపోయేలా చేయకూడదు. దివ్యాంగులకు సంబంధించి హక్కుల చట్టాన్ని పార్లమెంటులో రూపకల్పన చేశాం. ఇంత వరకూ ఈ చట్టం రాష్ట్రంలో అమలు కాలేదు. దివ్యాంగుల హక్కుల చట్టాన్ని తెలంగాణలో అమలు చేసి వారికి న్యాయం జరిగేలా చూడాలి. దివ్యాంగుల కోటాలో ఉన్న ఉద్యోగాలను ప్రభుత్వం తక్షణమే భర్తీ చేయాలి. -కిషన్ రెడ్డి, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి
ఈ సందర్భంగా పలువురు వీరజవాన్ల కుటుంబాలకు కిషన్ రెడ్డి.. ఆర్థిక సాయం చేశారు. దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందించారు. రాష్ట్రంలో దివ్యాంగుల కోటలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేసేలా ప్రభుత్వానికి సూచించారు.
ఇదీ చదవండి: భారత నౌకా దళంలోకి 'ఐఎన్ఎస్ విశాఖపట్నం'