Students Missing: మేడ్చల్ పరిధిలో సూరారం ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు. పాఠశాలకు వెళ్లి ఇంటికి తిరిగిరాకపోవడం వల్ల వారి ఆచూకీ కోసం తల్లిదండ్రులు తీవ్రంగా గాలించారు. సూరారం చెరవు కట్ట వద్ద వారి స్కూల్ బ్యాగులు లభ్యంకాగా కన్నవారిలో ఆందోళన మొదలైంది.
బాలికలు చెరువులో దూకారా... ఎక్కడికైనా వెళ్లారా అనే కోణంలో ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ప్రేమ వ్యవహారం ఉందా అనే కోణంలోనూ ఆరాతీస్తున్నారు. కూతుళ్లు కనిపించకపోవడం వల్ల వారి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు.
ఇదీ చదవండి : 'ఫ్రంట్ గురించి చర్చించలేదు.. ప్రత్యామ్నాయ విధానంలో భాగంగానే.. '