తెరాస ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అభివృద్ధి పథకాలే తనను గెలిపిస్తాయని మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని వనస్థలిపురం, మన్సూరాబాద్, బీఎన్‌రెడ్డి నగర్ డివిజన్లలో పర్యటించారు. 24 గంటల కరెంటుతో పాటు త్వరలో 24 గంటల నీళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.
ఇవీ చూడండి:పతుల గెలుపు కోసం... సతుల ఆరాటం