ETV Bharat / state

REVANTH REDDY: మూడుచింతలపల్లిలో రేవంత్ రెడ్డి దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష - మూడుచింతలపల్లి బయలుదేరిన రేవంత్‌ రెడ్డి

దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్షలో భాగంగా కేసీఆర్​ దత్తత గ్రామం మేడ్చల్​ జిల్లా మూడుచింతలపల్లిలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి దీక్ష ప్రారంభించారు. శామీర్​ పేట కట్టమైసమ్మ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించిన అనంతరం మూడుచింతలపల్లికి భారీ ఎత్తున కార్యకర్తలతో చేరుకున్నారు. దీక్ష రేపు సాయంత్రం వరకు కొనసాగనుంది.

REVANTH REDDY
దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష
author img

By

Published : Aug 24, 2021, 1:04 PM IST

Updated : Aug 24, 2021, 1:37 PM IST

దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్షలో భాగంగా.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి మూడుచింతలపల్లికి చేరుకున్నారు. భారీగా తరలివచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి దీక్ష ప్రారంభించారు. అంతకు ముందుగా రేవంత్​ రెడ్డి.. శామీర్​పేట కట్టమైసమ్మ ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించి నూతన వస్త్రాలు సమర్పించారు. రేవంత్​ రెడ్డికి స్వాగతం పలికేందుకు కాంగ్రెస్​ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. గజమాల వేసి, బాణా సంచా కాల్చి, డప్పు చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు.

మూడుచింతలపల్లికి చేరుకున్నాక అక్కడ రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్​, మాజీ సమితి అధ్యక్షులు వీరారెడ్డిల విగ్రహాలకు రేవంత్​ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడ నుంచి భారీ ప్రదర్శనగా దీక్షా సభాస్థలికి చేరుకున్నారు. రేవంత్​తో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, వేలాది మంది పార్టీ నేతలు, కార్యకర్తలతో దీక్షలో పాల్గొన్నారు. ఈరోజు రాత్రి రేవంత్​ మూడుచింతలపల్లిలోనే బస చేయనున్నారు. రేపు సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. అనంతరం రేవంత్ ప్రజలనుద్దేశించి రచ్చబండ నిర్వహించనున్నారు.

ఇదీ చదవండి: Congress Meeting: నేటి నుంచే మూడు చింతలపల్లిలో కాంగ్రెస్‌ రెండు రోజుల దీక్ష

Last Updated : Aug 24, 2021, 1:37 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.