ETV Bharat / state

అధ్వానంగా బహదూర్​పల్లి రోడ్డు.. విస్తరణ ఎప్పటికి పూర్తయ్యేనో..! - road

నిత్యం వేల వాహనాల ప్రయాణం.. అది రాష్ట్ర రహదారి.. కానీ ఆ రోడ్డుపై ప్రయాణించడానికి జనం జగ్గుతున్నారు. మేడ్బల్లా​ జిల్లాలోని బహదూర్​పల్లి వద్ద బాలానగర్​​ నుంచి మెదక్​ వెళ్లే మార్గం గుంతల మయంగా మారింది. రోడ్డు విస్తరణ పనులు అర్ధాంతరంగా ఆగిపోయి ప్రజల కష్టాలు రెట్టింపయ్యాయి.

బహదూర్పల్లి రోడ్డు
author img

By

Published : Sep 7, 2019, 9:05 AM IST

మేడ్చల్ జిల్లా బహదూర్​పల్లి వద్ద రోడ్డు అధ్వానంగా మారింది. 2012లో జీడిమెట్ల నుంచి సారెగూడెం వరకు ప్రతిపాదించిన రేడియల్ రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించి 8.5 కిలోమీటర్లకుగాను రూ. 69 కోట్ల 90 లక్షలతో టెండర్లు నిర్వహించి ఓ కాంట్రాక్టు సంస్థకు అప్పగించారు. నిబంధనల ప్రకారం వర్క్ ఆర్డర్లు జారీ చేసిన తేది నాటి నుంచి 18 నెలల లోపు ఈ పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత ఆ సంస్థపై ఉంది. కానీ వర్క్ ఆర్డర్ ఇచ్చి దాదాపు 7 ఏళ్ళు గడుస్తున్నా రోడ్డు పనులు పూర్తికాకపోవడం వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు.

అధ్వానంగా బహదూర్పల్లి రోడ్డు

ఇది చూడండి: సాగు ఆలస్యమే సకల కష్టాలకు మూలం..!

Intro:Tg_Hyd_84_06_Road Ibbandulu_Pkg_TS10011

మేడ్చల్ : బహదూర్పల్లి

నిత్యం వేలాదిగా వాహనాలు ప్రయాణం..అది రాష్ట్ర రహదారి .. కానీ రోడ్డు మాత్రం సరిగ్గా లేదు అదే బాలానగర్ నుండి మెదక్ వెళ్లే మార్గంలో బహదూర్పల్లి వద్ద అర్థాంతరంగా నిలిచిపోయిన రోడ్డు విస్తరణ పనులు..

Note : 1. భారత్ కోసం వాయిస్ ఓవర్ తో పంపించాను.
2. టివి కోసం స్క్రిప్ట్ కూడా పంపాను పరిశీలించగలరు మరియు టివి కోసం విజువల్స్ అదనంగా ఉన్నాయి గమనించగలరు. బైట్స్ వాయిస్ ఓవర్ దాంట్లో ఉన్నాయి అవి వాడుకోగలరు టీవీకి

Body:బాలానగర్ నుండి మెదక్ వెళ్లే రాష్ట్ర రహదారిపై ప్రయాణించాలంటే ప్రజలకు నరకయాతనలా కనిపిస్తుంది.
2012లో జీడిమెట్ల నుండి సారెగూడెం వరకు ప్రతిపాదించిన రేడియల్ రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించి 8.5 కిలోమీటర్లకు గాను రూ 69 కోట్ల 90 లక్షలతో టెండర్లు నిర్వహించి ఓ కాంట్రాక్టు సంస్థకు అప్పగించారు. నిబంధనల ప్రకారం వర్క్ ఆర్డర్లు జారీ చేసిన తేది నాటినుంచి 18 నెలల లోపు ఈ పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత ఆ సంస్థపై ఉంది కానీ వర్క్ ఆర్డర్ ఇచ్చి దాదాపు 7 ఏళ్ళు గడుస్తున్నా రోడ్డు పనులు పూర్తికాకపోవడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఉదయం సాయంత్రం వేళల్లో గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుచోట్ల రహదారి నిర్మాణం కోసం తీసిన గోతుల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నా పట్టించుకోవడం లేదు.
నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి జిల్లాలను కలిపే ఈ రహదారి ఇరువైపుల సూరారం, జీడిమెట్ల, జిన్నారం, కాజిపల్లి, బొంతపల్లి, ఐడీఏ బొల్లారం, గుమ్మడిదల, కానుకుంటా, గాంధీనగర్, బాలానగర్ ప్రాంతాల్లో పరిశ్రమలున్నాయి. దీంతో ముడి సరుకు తీసుకెళ్లే వాహనాలతో పాటు సాధారణ వాహనాలు నిత్యం ఈ రోడ్డుపై తిరుగుతుంటాయి. రోడ్డు సరిగా లేనందున ఇప్పటివరకు ఆరోడ్డుపై వేర్వేరు ఘటనల్లో 17 మంది మృత్యువాత పడ్డారు. అనేక మంది ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్న ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదని, నిత్యం ప్రజాప్రతినిధులు ఇదే రోడ్డు గుండా ప్రయాణం కొనసాగిస్తారని అయినా వారికి పట్టనట్లు వ్యవహరించడం బాధాకరమని స్థానికులు, ప్రయాణికులు వాపోతున్నారు. నిత్యం భారీ వాహనాలు ప్రయాణిస్తున్నప్పటికీ రోడ్డు పూర్తి కాకపోవడంతో భారీగా దుమ్ము, ధూళి వల్ల అనేక రోగాల బారిన పడుతున్నట్లు ప్రయాణికులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Conclusion:బైట్ : ప్రయాణికులు, స్థానికులు

My name : Upender, కుత్బుల్లాపూర్, 9000149830
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.