మేడ్చల్ జగద్గిరి గుట్టకు చెందిన ఏడు మంది పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఉద్యోగుల్లో ముగ్గురు గోదావరి బోటు ప్రమాదంలో గల్లంతయ్యారు. హైదరాబాద్ నుంచి వెళ్లిన ఈ ఏడుగురిలో నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. మిగిలిన ముగ్గురి కోసం గాలిస్తున్నారని... ప్రమాదం నుంచి బయటపడ్డ సురేశ్ ఫోన్ చేసి చెప్పాడు. సురేశ్ కుమార్ సురక్షితంగా ఉన్నాడని తెలియడంతో అతని కుటుంబ సభ్యులు, బంధువులు ఆనందం వ్యక్తం చేశారు. గల్లంతైన వారందరూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నట్టు వారు తెలిపారు.
ఇదీ చూడండి: ఒకే కుటుంబానికి చెందిన 11 మంది గోదావరిలో గల్లంతు